Advertisementt

లేని తలనొప్పులు తెచ్చుకున్న అసిన్‌...!

Sat 04th Apr 2015 11:25 AM
asin,virat kohli,anushka sharma,twitter post  లేని తలనొప్పులు తెచ్చుకున్న అసిన్‌...!
లేని తలనొప్పులు తెచ్చుకున్న అసిన్‌...!
Advertisement
Ads by CJ

కోరికోరి కొరవితో తల గోక్కోవడం అంటే ఇదేనేమో...! తాజాగా హీరోయిన్‌ అసిన్‌ చేసిన పని చూస్తే అలానే అనిపిస్తోంది. ఓవైపు టీమిండియా సెమీస్‌లో ఓటమి పాలై క్రికెట్‌ అభిమానులంతా నిరాశలో ఉన్నారు. తమ కోపాన్నంతా విరాట్‌కోహ్లి ప్రియురాలు అనుష్కశర్మ మీద చూపుతున్నారు. ఇలాంటి సమయంలో అనుష్కకు సపోర్ట్‌గా వ్యాఖ్యలు చేసిన ఆసిన్‌ కోరి ఇబ్బందులు తెచ్చుకున్నట్లయింది. అనుష్క శర్మ సెమీస్‌ రోజు ఆస్ట్రేలియా రావడం వల్లే కోహ్లి ఏకాగ్రత దెబ్బతిని ఒకే పరుగుకు ఔటయ్యాడని క్రికెట్‌ అభిమానులు దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. టీమిండియా ఓటమికి అనుష్కకు సంబంధం ఏమిటి? ఆమెను బాధ్యురాలిని చేయడం మూర్ఖత్వం.. అంటూ అసిన్‌ ట్వీట్‌ చేసింది. దీంతో క్రికెట్‌ అభిమానులు అనుష్కను వదలి ఆసిన్‌ మీద విమర్శలు గుప్పించడం మొదలుపెడుతున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ