Advertisementt

బాలీవుడ్‌లో అదరగొడుతున్న ఆసీస్‌ క్రికెటర్‌

Sat 04th Apr 2015 06:30 AM
brett lee,bollywood film,yaan indian,australia crickter  బాలీవుడ్‌లో అదరగొడుతున్న ఆసీస్‌ క్రికెటర్‌
బాలీవుడ్‌లో అదరగొడుతున్న ఆసీస్‌ క్రికెటర్‌
Advertisement
Ads by CJ

భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇతన దేశాల క్రీడాకారులకు వారివారి దేశాల కంటే కూడా మన వద్దే అధిక ఆదరణ, అభిమానులు ఉంటారు. ఇక ఆస్ట్రేలియా క్రికెటర్లు కూడా ఇందుకు మినహాయింపు కాదు. ఇదే విషయాన్ని బాలీవుడ్‌ ప్రొడ్యూసర్లు క్యాష్‌ చేసుకోవాలని చూస్తుంటారు. గతంలో పాకిస్తాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌కు పలు హిందీ సినిమాల్లో ఆఫర్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఆస్ట్రేలియా వెటరన్‌ క్రికెటర్‌ బ్రెట్‌లీ కూడా ఓ బాలీవుడ్‌ సినిమాలో నటిస్తున్నాడు. 'యాన్‌ ఇండియన్‌' సినిమాలో బ్రెట్‌లీ ఓ పూర్తి స్థాయి పాత్రలో కనువిందు చేస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన ఓ పోస్టర్‌లో బ్రెట్‌లీ బాలీవుడ్‌ భామతో డ్యాన్స్‌ చేస్తూ కనిపించాడు. ఈ సినిమాలో ఆస్ట్రేలియాలో పనిచేసే ఓ టీచర్‌గా నటిస్తున్న బ్రెట్‌లీ భర్త చనిపోయిన మహిళతో ప్రేమలో పడటం కథాంశంగా 'యాన్‌ ఇండియన్‌' తెరకెక్కుతోంది. నిప్పులు చెరిగే బంతులతో ఇప్పటికే భారతీయులను ఆకట్టుకున్న బ్రెట్‌లీ ఇక సినీ అభిమానులను ఏమాత్రం ఆకట్టుకుంటాడో ఈ చిత్రం చూస్తే తెలుస్తుంది. సింగర్‌ కూడా అయిన బ్రెట్‌లీ గతంలో ఇండియాలో పలు స్టేజీషోల్లో కూడా పార్టిసిపేట్‌ చేశాడు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ