Advertisementt

'బాహుబలి' విషయంలో రాజీ పడడం లేదు!

Sat 04th Apr 2015 01:59 AM
rajamouli,bahubali,magadheera,chaina,koriyan  'బాహుబలి' విషయంలో రాజీ పడడం లేదు!
'బాహుబలి' విషయంలో రాజీ పడడం లేదు!
Advertisement
Ads by CJ

'మగధీర' చిత్రంతో తెలుగు సినిమా స్థాయిని పెంచిన దర్శకధీరుడు రాజమౌళి. 'బాహుబలి' చిత్రంతో అంతర్జాతీయ సాంకేతిక నిపుణులను తెలుగుకు పరిచయం చేస్తున్నారు. అత్యుత్తమ ప్రమాణలతో తెరకెక్కిస్తున్న 'బాహుబలి' నిర్మాణంతర కార్యక్రమాల విషయం రాజీ పడడం లేదు. విజువల్ ఎఫెక్ట్స్ కోసం చైనా, కొరియన్ టెక్నీషియన్లతో కలిసి పని చేస్తున్నారు. కీలక సన్నివేశాల గ్రాఫిక్స్ పనుల నిమిత్తం షియోల్ వెళ్ళారు. రాజమౌళితో పాటు 'మగధీర', 'ఈగ' చిత్రాలకు పని చేసిన విజువల్ ఎఫెక్ట్ సూపర్ వైజర్ శ్రీనివాస మోహన్ వారితో చర్చలు జరుపుతున్నారు. 

ప్రభాస్, అనుష్క, తమన్నా నటీనటులుగా తెరకెక్కుతున్న ఈ చారిత్రాత్మక చిత్రంలో రానా ప్రతినాయకుడి పాత్రలో కనిపిస్తారు. కె. రాఘవేంద్ర రావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ, దేవినేని ప్రసాద్ ఈ భారి బడ్జెట్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యంయం కీరవాణి సంగీత దర్శకుడు. ప్రస్తుతం నిర్మాణంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మే 15న చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ