Advertisementt

‘కిక్‌2’ కోసం రవితేజ రిస్క్‌....!

Sun 29th Mar 2015 12:22 PM
raviteja,kick 2,raviteja risk,kalyan ram  ‘కిక్‌2’ కోసం రవితేజ రిస్క్‌....!
‘కిక్‌2’ కోసం రవితేజ రిస్క్‌....!
Advertisement
Ads by CJ

రవితేజ నటించిన ‘కిక్‌’ చిత్రంలో హీరో రవితేజ కిక్‌ కోసం ఎన్నో రిస్క్‌లు చేస్తుంటాడు. త్వరలో ఆయన అదే సురేంద్రరెడ్డితో కలిసి ‘కిక్‌2’గా రానున్నాడు. అయితే ఈ సినిమా విడుదల విషయంలో రవితేజ, సురేంద్రరెడ్డి, నందమూరి కళ్యాణ్‌రామ్‌లు రిస్క్‌ చేస్తున్నారనే చెప్పాలి.ఓవైపు ఏప్రిల్‌ చివరి వారంలో ‘రుద్రమదేవి’  రానుంది. మే 1న బాలయ్య ‘లయన్‌’గా వస్తాడని తెలుస్తోంది. ఇక మే 15న ‘బాహుబలి’ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. దీంతో వీటి మధ్యలో రవితేజ ‘కిక్‌2’ చిత్రం మే 7న రంగంలోకి దిగనుందని సమాచారం. ఇదే జరిగితే ‘లయన్‌’, ‘బాహుబలి’ చిత్రాల మద్య కేవలం వారం గ్యాప్‌లో ఈ చిత్రం విడుదలవుతోంది. మరి ఈ రిస్క్‌కు చివరి వరకు వీరు కట్టుబడి ఉంటారా? లేక సరైన సమయం కోసం మరింత కాలం వెయిట్‌ చేస్తారా? అని ఎదురుచూడాలి. గతంలో కూడా రవితేజ బాలకృష్ణ నటించిన చిత్రాలు విడుదలయినప్పుడు రెండు సార్లు, రామ్‌చరణ్‌ ‘మగధీర’ ముందు ఒకసారి ఇలాంటి రిస్క్‌ చేసివున్నాడు. వాస్తవానికి పోయిన దసరాకు ‘లౌక్యం’కు గోపీచంద్‌ చేసిన రిస్కే ఇప్పుడు రవితేజ చేయనున్నాడని చెప్పుకోవచ్చు....!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ