Advertisementt

త్రిషపై వార్తలు హల్‌చల్‌...!

Sat 28th Mar 2015 02:43 PM
trisha,horror film,trisha wise decision,manager hari,engagement  త్రిషపై వార్తలు హల్‌చల్‌...!
త్రిషపై వార్తలు హల్‌చల్‌...!
Advertisement
Ads by CJ

సౌత్‌ ఇండియన్‌ టాప్‌ హీరోయిన్‌ త్రిష తమిళ బిజినెస్‌మేన్‌ వరుణ్‌మణియన్‌ను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ కూడా ఆ మద్య చెన్నైలో గ్రాండ్‌గా జరిగింది. ఎంగేజ్‌మెంట్‌ తర్వాత తన క్లోజ్‌ ఫ్రెండ్స్‌కి పార్టీ కూడా ఇచ్చింది ఈ బామ. అయితే వీరి ఎంగేజ్‌మెంట్‌ జరిగి చాలా రోజులైన పెళ్లికి సంబంధించిన వార్తలు ఎక్కడా వినిపించకపోవడం చర్చనీయాంశం అయింది. ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు పలు అనుమానాలకు తావిస్తున్నాయని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. వరుణ్‌తో ఎంగేజ్‌మెంట్‌ తర్వాత త్రిషకు బాగా కలిసొస్తోందని త్రిష ప్రొఫెషనల్‌గా బాగా బిజీ అయిపోయిందిట. ఆమె నటించిన ఓ తమిళ సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. దీంతో ప్రస్తుతం ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. కొత్తగా కొన్ని ప్రాజెక్ట్‌లకు ఆమె సైన్‌ చేసింది. అంతా బాగానే ఉన్నా ఓ షాకింగ్‌ వార్త తమిళ సినీ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. వరుణ్‌కు దూరంగా ఉండేందుకు త్రిష ట్రై చేస్తోంది అనేది ఆ వార్త సారాంశం. ఈ నిర్ణయం త్రిష ఇటీవలే తీసుకొందని సమాచారం. ఇటీవల వరణ్‌కు సంబంధించిన ప్రొడక్షన్‌ హౌస్‌ నుండి వచ్చిన సినిమా ఆఫర్‌ను కూడా ఆమె రిజెక్ట్‌ చేసి తన మేనేజర్‌ గిరికి చెందిన ఓ కామెడీ హర్రర్‌ ప్రాజెక్ట్‌కు సైన్‌ చేసిందని తెలుస్తోంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ