Advertisementt

రాజేంద్రప్రసాద్ రాజకీయాలు స్టార్ట్ చేశాడు!

Mon 23rd Mar 2015 09:37 AM
rajendhraprasad,maa elections,jayasudha,politics  రాజేంద్రప్రసాద్ రాజకీయాలు స్టార్ట్ చేశాడు!
రాజేంద్రప్రసాద్ రాజకీయాలు స్టార్ట్ చేశాడు!
Advertisement
Ads by CJ

మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్ష ఎన్నికలలో డా॥ రాజేంద్రప్రసాద్ పోటీ చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే హీరో రాజేంద్రప్రసాద్‌కు పోటీగా మాజీ ఎమ్మెల్యే, నటి జయసుధ కూడా రంగంలోకి దిగడంతో ఏకపక్షమనుకున్న ఎన్నికలు ఇప్పుడు పోటాపోటీగా మారాయి. అయితే ఇప్పటికే పలువురు సినీ పెద్దలు, మెగా ఫ్యామిలీ నుండి నాగబాబు రాజేంద్రప్రసాద్ కు మద్దతు తెలిపారు. మొదటి నుండి రాజేంద్రప్రసాద్ ఏకగ్రీవంగా ఎన్నికవ్వాలనే ఆలోచనలో ఉన్నాడు. కానీ జయసుధ ఆయనకీ పోటీగా మారడంతో ఓ ప్రముఖ ప్రతిపక్ష రాజకీయనాయకుడి ద్వారా జయసుధను ఈ ఎన్నికల నుండి  విత్ డ్రా చేయించేందుకు ప్లాన్ చేస్తున్నాడని ఫిలిం నగర్ వర్గాల ద్వారా తెలుస్తుంది. సో.. ఇదంతా చూస్తుంటే రాజకీయాలలో రాజేంద్రప్రసాద్ ఓనమాలు దిద్దేసినట్లే అనిపిస్తుంది కదా..!

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ