Advertisementt

‘జిల్‌’కు ట్రంప్‌కార్డు కానున్న రాశిఖన్నా....!

Mon 23rd Mar 2015 04:43 AM
rashi khanna,jil,gopichand,a certificate,censor  ‘జిల్‌’కు ట్రంప్‌కార్డు కానున్న రాశిఖన్నా....!
‘జిల్‌’కు ట్రంప్‌కార్డు కానున్న రాశిఖన్నా....!
Advertisement
Ads by CJ

‘లౌక్యం’ వంటి సూపర్‌హిట్‌ చిత్రం తర్వాత గోపీచంద్‌ నటిస్తున్న తాజా చిత్రం ‘జిల్‌’ ఈనెల 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. రాధాకృష్ణకుమార్‌ దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్‌ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. కాగా ఈ చిత్రానికి పెద్దలకు మాత్రమే అనే ఉద్దేశ్యంతో సెన్సార్‌ వారు ‘ఎ’ సర్టిఫికేట్‌ ఇచ్చారు. దీనికి కారణం అందాల రాశి రాశిఖన్నా అని తెలుస్తోంది. ఈ చిత్రంలో ఆమె మంచి అభినయం చేసిందని గోపీచంద్‌తో సహా యావత్‌ యూనిట్‌ ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతుంటే ఆమె ఈ సినిమాలో తన అందాలను యమాగా చూపిస్తూ.. లిప్‌కిస్‌లు గట్రా దంచేసిందని తెలుస్తోంది. పోస్టర్స్‌, ట్రైలర్స్‌లో ఆ విషయం బాగానే కనిపిస్తోంది. లిప్‌లాక్‌లు, టూపీస్‌ బికినీలు గట్రా దుమ్మురేపిందని అంటున్నారు. మరి గోపీ కోసం కాకపోయినా రాశిఖన్నా కోసమైన మొదటి వారం థియేటర్లు యూత్‌తో నిండిపోతాయని ఖచ్చితంగా చెప్పవచ్చు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ