Advertisementt

సినీజోష్‌ ఇంటర్వ్యూ: హీరో ఆదిత్‌

Wed 18th Mar 2015 01:41 PM
telugu movie tungabhadra,hero adith,sai korrapati,hari goura,tungabhadra on 20th march  సినీజోష్‌ ఇంటర్వ్యూ: హీరో ఆదిత్‌
సినీజోష్‌ ఇంటర్వ్యూ: హీరో ఆదిత్‌
Advertisement

‘కథ’, ‘వీకెండ్‌ లవ్‌’ వంటి చిత్రాలతోపాటు తమిళ్‌లో కూడా రెండు సినిమాలు చేసి లేటెస్ట్‌గా ‘తుంగభద్ర’ చిత్రంతో మరోసారి ప్రేక్షకుల్ని అలరించడానికి వస్తున్నాడు హీరో ఆదిత్‌. వారాహి చలనచిత్రం పతాకంపై ఆదిత్‌, డిరపుల్‌ జంటగా సాయిశివాని సమర్పణలో శ్రీనివాసకృష్ణ గోగినేని దర్శకత్వంలో సాయి కొర్రపాటి ప్రొడక్షన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని మార్చి 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో ఆదిత్‌తో ‘సినీజోష్‌’ ఇంటర్వ్యూ.

‘తుంగభద్ర’ని ఎప్పటి సినిమాలా చూపించారు?

ఒక పర్టిక్యులర్‌ పీరియడ్‌ అంటూ ఏమీ లేకుండా తీసిన సినిమా. అంటే సెల్‌ ఫోన్‌ అందుబాటులో లేని పీరియడ్‌ని ఈ కథ కోసం ఎంచుకున్నాం. ఎందుకంటే సెల్‌ ఫోన్‌ వుండడం వల్ల కథకి, స్క్రీన్‌ప్లే కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం వుంది. అందుకే ఏ సంవత్సరంలోని కథ అనేది మెన్షన్‌ చెయ్యలేదు. 

మీ బ్యాక్‌గ్రౌండ్‌ గురించి?

మాది కోయంబత్తూర్‌. మా నాన్నగారు బ్యాంక్‌లో వర్క్‌ చేస్తారు. మేం మైగ్రేట్‌ అయి హైదరాబాద్‌లో సెటిల్‌ అయ్యాం. క్రాస్‌ రోడ్స్‌లోని గాంధీనగర్‌, హిమాయత్‌ నగర్‌లలో నేను పెరిగాను. కొన్నాళ్ళు గుంటూరులో కూడా వున్నాను. ఆ తర్వాత వైజాగ్‌లో టెన్త్‌, ఇంటర్‌ చదివాను. చెన్నైలో బి.ఎ. జర్నలిజమ్‌  అండ్‌ ఫోటోగ్రఫీలో డిగ్రీ తీసుకున్నాను. కాలేజీలో టీమ్స్‌ వుంటాయి కదా. నేను థియేటర్‌ టీమ్‌లో చేరాను. అక్కడ రజానీగారు మాకు కోచింగ్‌ ఇచ్చారు. డ్రాయింగ్‌, మ్యూజిక్‌ నేర్చుకున్నట్టుగా యాక్టింగ్‌ ఒక ప్యాషన్‌తో నేర్చుకున్నాను. అది ఇప్పుడు ఫుడ్‌ పెడుతుందని ఎక్స్‌పెక్ట్‌ చెయ్యలేదు. 

టైటిల్‌ జస్టిఫికేషన్‌ ఏమిటి?

‘తుంగభద్ర’ అంటే ఒక నది గురించి తీసిన సినిమా కాదు. తుంగ, భద్రావతి అనే రెండు నదులు కలిసి తుంగభద్రగా ప్రవహిస్తుంది. నదులు కలుస్తాయి కానీ వాటి పక్కన వున్న మనుషులు కలవరు అనే ఒక కాన్సెప్ట్‌తో తీసిన సినిమా. ఒక ఊరిలో రెండు వర్గాల మధ్య జరిగే కథ. దాంట్లో ఓ లవ్‌ స్టోరీ కూడా వుంటుంది. ఆ రెండు వర్గాల వల్ల ఏం జరిగింది, ఈ లవ్‌స్టోరీ వల్ల ఏం జరిగిందనేది కథ. పార్టీ ఎక్కడో వుంటుంది. దాని కోసం ఇక్కడ మనుషులు కొట్టుకుంటున్నారు అనే మెసేజ్‌తో ఈ సినిమా చెయ్యాలనుకున్నారు డైరెక్టర్‌.

ఇందులో మెయిన్‌ క్యారెక్టర్స్‌ ఎలా వుంటాయి?

ఇది న్యూ జనరేషన్‌ మూవీ. పర్టిక్యులర్‌గా ఒకే క్యారెక్టర్‌ మీద రన్‌ అయ్యే సినిమా కాదు. నాది, హీరోయిన్‌ది లవ్‌స్టోరీ వుంటుంది. దీనితోపాటు సినిమాలో చాలా కీ రోల్స్‌ వున్నాయి. కోట శ్రీనివాసరావుగారు, శివకృష్ణగారు, సత్యరాజ్‌గారు ఆ కీ రోల్స్‌ చేశారు. వీరితోపాటు చలపతిరావుగారు, ఆయనకు ముగ్గురు కొడుకులు. ఇలా చాలా క్యారెక్టర్స్‌ వున్నాయి. వైట్‌ అండ్‌ బ్లాక్‌ కాకుండా గ్రే క్యారెక్టర్స్‌ కూడా వున్నాయి. 

ఈ సినిమా మీకు కరెక్ట్‌ ఫౌండేషన్‌ అనుకుంటున్నారా?

‘కథ’ సినిమా చేసిన తర్వాత నన్ను నేను చూసుకుంటే నాకు నచ్చలేదు. ఇలా నవ్వాను, అలా నడిచాను అని నాకు నేను క్వశ్చన్‌ చేసుకోవడం మొదలెట్టాను. హ్యాపీడేస్‌ చేసినపుడు ఈ సినిమా అయితే నాకు కరెక్ట్‌ అనిపించింది. అందుకే తమిళ్‌ సైడ్‌ వెళ్ళాను. యాక్టింగ్‌లో మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి ఒక సీన్‌ చెప్తే ఆ సీన్‌లో ఎంత ప్రిపేర్‌ అవ్వాలనేది తెలిసిపోతోంది. ఈ సినిమా విషయానికి వస్తే నా క్యారెక్టర్‌కి పూర్తి న్యాయం చేశాననుకుంటున్నాను. 

తెలుగు, తమిళ్‌ ఒకేసారి రిలీజ్‌ చేస్తున్నారా?

నిజానికి అలాంటి ప్లాన్‌ ఏమీలేదు. సత్యరాజ్‌గారు, ఇంకా కొంత మంది ఆర్టిస్టులు చెయ్యడం వల్ల అలా అనిపించి వుండొచ్చు. నేనే చెప్పాను తమిళ్‌ నాకు చిన్న మార్కెట్‌ వుంది, సత్యరాజ్‌గారు కూడా వున్నారు డబ్బింగ్‌ చేస్తే బాగుంటుందని చెప్పాను. 

నెక్స్‌ట్‌ ప్రాజెక్ట్స్‌?

తెలుగు, తమిళ్‌లో ఒక సినిమా జరుగుతోంది. తెలుగులో ‘నీవైపే’ పేరు పెట్టడం జరిగింది. దీనికి సంబంధించిన టీజర్‌ కూడా రిలీజ్‌ అయింది. హెచ్‌.ఎఫ్‌.ఆర్‌. అనే టెక్నాలజీతో ఈ సినిమా చేస్తున్నాం. చాలా పెద్ద సినిమా. కంప్లీట్‌ అవడానికి ఓ సంవత్సరం పడుతుంది. ‘తుంగభద్ర’ ఎంత పెద్ద సినిమానో అది కూడా పెద్ద సినిమా. అది కాకుండా డి.ఎస్‌.రావుగారికి ఒక సినిమా చేస్తున్నాను అంటూ ఇంటర్వ్యూ ముగించారు హీరో ఆదిత్‌. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement