Advertisementt

మహేష్ సరసన ఛాన్స్ రాగానే ఎగిరిగంతేస్తోందట..!

Tue 17th Mar 2015 07:51 AM
maheshbabu,poorna,koratala siva,sreemanthudu  మహేష్ సరసన ఛాన్స్ రాగానే ఎగిరిగంతేస్తోందట..!
మహేష్ సరసన ఛాన్స్ రాగానే ఎగిరిగంతేస్తోందట..!
Advertisement
Ads by CJ

'మిర్చి'  లాంటి బ్లాక్ బాస్టర్ సినిమాను డైరెక్ట్ చేసిన దర్శకుడు కొరటాల శివ తాజాగా మహేష్ బాబు హీరోగా 'శ్రీమంతుడు' అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దేవిశ్రీప్రసాద్ స్వరాల్ని అందిస్తున్నారు. కొరటాల శివ, మహేష్ బాబు, దేవిశ్రీప్రసాద్ కాంబినేషన్ లో వచ్చే ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఈ సినిమాలో ఐటెం సాంగ్ లో నటించడానికి పూర్ణ ను సంప్రదించగా ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది. 'మహాలక్ష్మి' , 'సీమటపాకాయ్' , 'అవును' సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన నటి పూర్ణ ఇప్పుడు మహేష్ సరసన నర్తించడానికి అవకాశం రాగానే ఆమె మొహం వెలిగిపోతోందట. ఎప్పుడెప్పుడు షూటింగ్ మొదలవుతుందా అని పూర్ణ ఎదురుచూస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెప్పుకుంటున్నారు. దేవిశ్రీప్రసాద్ మాస్ మ్యూజిక్ మహేష్-పూర్ణ కెమిస్ట్రీ ఈ సినిమాకు ఎంత వరకు హెల్ప్ అవుతాయో వేచి చూడాల్సిందే..! 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ