Advertisementt

వెలవెలబోతున్న థియేటర్లు...!

Mon 16th Mar 2015 04:41 AM
gopala gopala,temper,patas,world cup,summer season  వెలవెలబోతున్న థియేటర్లు...!
వెలవెలబోతున్న థియేటర్లు...!
Advertisement
Ads by CJ

థియేటర్లు ప్రేక్షకులు లేక వెలవెలబోతున్నాయి. ఈగలు, దోమలు తరుముకోవడమే థియేటర్‌ యాజమాన్యాల పని అయిపోయింది. ఈ ఏడాది ఇప్పటివరకు వచ్చిన చిత్రాల్లో ‘గోపాల గోపాల’,‘పటాస్‌’, ‘టెంపర్‌’ చిత్రాలు మాత్రమే కాస్త సందడి చేశాయి. అది కూడా కేవలం వారం రెండు వారాలు మాత్రమే. ‘టెంపర్‌’ చిత్రం కూడా విడుదలైన రెండు వారాలకు చేతులెత్తేయడం, ఇక చిన్న సినిమాలు వరుసగా విడుదలవుతున్నప్పటికీ థియేటర్ల వద్ద ప్రేక్షకులు లేరు. మరోవైపు ప్రపంచకప్‌ , విద్యార్థుల పరీక్షలు కూడా కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో మరలా సమ్మర్‌ సీజన్‌ ముగిసి, ప్రపంచకప్‌ అయిపోయిన తర్వాత, విద్యార్థుల పరీక్షలు అయిపోయిన తర్వాత మాత్రమే మరలా పెద్ద సినిమాలు, స్టార్‌ హీరోల చిత్రాలు విడుదలకు సిద్దమవుతున్నాయి. మరలా అవి విడుదలైన తర్వాతే థియేటర్ల యాజమాన్యాల కష్టాలు తీరి, బాక్సాఫీస్‌ వద్ద కాసుల సందడి మొదలవుతుంది. 

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ