మహేష్‌ ఓవర్‌సీస్‌ రికార్డు...!

Sun 15th Mar 2015 04:11 PM
mahesh babu,overseas,record,srimanthudu,koratala siva  మహేష్‌ ఓవర్‌సీస్‌ రికార్డు...!
మహేష్‌ ఓవర్‌సీస్‌ రికార్డు...!
Sponsored links
మహేష్‌బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘శ్రీమంతుడు’ (వర్కింగ్‌టైటిల్‌) సినిమా ఓవర్‌సీస్‌ రైట్స్‌ రికార్డు రేటును అమ్ముడుపోయినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ఉగాదికానుకగా ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రం ఓవర్‌సీస్‌ రైట్స్‌ను క్లాసిక్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ సంస్థ 
8.1కోట్లకు సొంతం చేసుకుందని సమాచారం. ఇంతకు ముందు ఈ రికార్డు పవన్‌కళ్యాణ్‌ నటించిన ‘అత్తారింటికి దారేది’, మహేష్‌, వెంకటేష్‌లు కలిసి నటించిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’ చిత్రాల పేరిట ఉండేది. మొత్తానికి ‘శ్రీమంతుడు’తో మహేష్‌ తన రికార్డును తానే బద్దలు కొట్టినట్లు అయిందని ఆయన అభిమానులు ఆనందపడుతున్నారు. 
Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019