‘లయన్‌’లో అర్చన చేస్తోంది ఐటంసాంగ్‌ కాదట!

నూతన దర్శకుడు సత్యదేవా డైరెక్షన్‌లో బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న చిత్రం ‘లయన్‌’. ఇందులో త్రిష, రాధికాఆప్టే హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా తెలుగమ్మాయి అర్చన అలియాస్‌ వేద ఈ చిత్రంలో కొన్ని ఇంపార్టెంట్‌ సీన్లుతో పాటు ఓ స్పెషల్‌సాంగ్‌లో కూడా చేస్తోంది. ఇటీవలే ఆ సాంగ్‌ చిత్రీకరణ పూర్తయింది. ఈ సాంగ్‌ గురించి అర్చన మాట్లాడుతూ.... నేను చేస్తున్నది ఐటంసాంగ్‌ కాదు. అది ఓ సిట్యుయేషన్‌ సాంగ్‌. సినిమా కథలో భాగంగా సాగిపోతుంది. అంతేగానీ అది ఐటంసాంగ్‌ కాదు... అని అంటోంది. 

balakrishna
satyadeva
lion movie
archana
item song