Advertisementt

తెలుగులో అవకాశాలులేని చందమామ!

Fri 13th Mar 2015 02:07 PM
kajal agarwal,temper,no movies,telugu,tollywood,kajal movies  తెలుగులో అవకాశాలులేని చందమామ!
తెలుగులో అవకాశాలులేని చందమామ!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో ప్రస్తుతం ఉన్న టాప్‌హీరోయిన్లలో కాజల్‌కు ఉన్న సక్సెస్‌ రేట్‌ ఎవ్వరికీ లేదు. ఇంతకాలం హీరోయిన్‌గా కొనసాగుతూ ఒక్క పవన్‌కల్యాణ్‌ మినహా మిగిలిన టాప్‌స్టార్స్‌ అందరి సరసన నటించి సక్సెస్‌లు కొట్టిన ఈ అమ్మడుకు తాజాగా ‘టెంపర్‌’ చిత్రం కూడా హిట్టును అందించింది. అయినా తాజాగా ఆమెకు ఒక్క టాలీవుడ్‌ సినిమా కూడా చేతిలో లేకపోవడం గమనార్హం. ఏదో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు సెంటిమెంట్‌గా ఛాన్స్‌లు ఇస్తే తప్ప ఆమెకు అవకాశాలు రావడం లేదని అర్థమైపోతోంది.దీంతో ఆమె కూడా ముందు జాగ్రత్తగా కోలీవుడ్‌పై దృష్టిపెట్టింది. ధనుష్‌తో ‘మారి’, విశాల్‌తో మరో సినిమాతోపాటు విక్రమ్‌ హీరోగా రూపొందే ఓ చిత్రంలో కూడా ఆమె హీరోయిన్‌గా నటిస్తోంది. అంతేకాదు...బాలీవుడ్‌లో రెండు మంచి అవకాశాలు ఆమె చేతిలో ఉన్నాయి. మొత్తానికి ఆమె టాలీవుడ్‌కు బై చెప్పే సమయం వచ్చేసిందని, ఇకపై ఆమె ఇతర భాషలపై దృష్టికేంద్రీకరిస్తోందని తెలుస్తోంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ