కొరియోగ్రాఫర్‌గా, స్పెషల్ సాంగ్స్ స్పెషలిస్ట్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, దర్శకునిగా.. ఇలా ఆల్‌రౌండర్ అనిపించుకున్న వ్యక్తి ప్రభుదేవా. కాగా ఆయన ఇటీవల వరకు బాలీవుడ్‌లోని డైరెక్టర్లలో టాప్ పొజిషన్‌లో ఉన్నాడు.కానీ ఇటీవల ఆయనకు డైరెక్టర్‌గా కొన్ని అపజయాలు ఎదురయ్యాయి. అయినా ఆయన నిరుత్సాహపడలేదు. కాగా ప్రభుదేవా ఈమధ్య హీరోగా నటించడం మానేసి కేవలం గెస్ట్‌రోల్స్ మాత్రమే చేస్తున్నాడు. అయితే ఆయన త్వరలో ఓ తెలుగు దర్శకుని చిత్రంలో హీరోగా నటించే అవకాశం ఉందని కోలీవుడ్‌వర్గాలు అంటున్నాయి. ‘గ్రీన్‌సిగ్నల్’ ఫేమ్ విజయ్ మద్దాల చెప్పిన స్టోరీలైన్ ప్రభుదేవాకు విపరీతంగా నచ్చిందని దాంతో ఆయన హీరోగా నటించడానికి ఒప్పుకొన్నాడని, ఈ చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందనుందని సమాచారం. అమెరికాలోని రోడ్ ట్రిప్ నేపథ్యంలో సాగే థ్రిల్లర్ కథాంశంతో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఇందులో హీరోగా ప్రభుదేవా క్యారెక్టరైజేషన్ కూడా డిఫరెంట్‌గా సాగుతుందని అంటున్నారు. మొత్తానికి ఈ వార్త ప్రభుదేవా అభిమానులకు తీపి వార్తే అని చెప్పవచ్చు.