మహేష్‌కు అలాంటి టైటిలేంటి?

Wed 11th Mar 2015 05:20 AM
srimanthudu movie,mahesh babu,koratala shiva  మహేష్‌కు అలాంటి టైటిలేంటి?
మహేష్‌కు అలాంటి టైటిలేంటి?
Sponsored links

‘మిర్చి’ చిత్రంతో తన దర్శకత్వ ప్రతిభను చాటుకున్న కొరటాల శివ ఆ చిత్రాన్ని పూర్తి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించి అందరి హీరోల దృష్టిలో పడ్డాడు..ఆ కోవలోనే మహేష్‌ను డైరెక్ట్ చేసే అవకాశాన్ని పొందాడు. ప్రస్తుతం ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ఓ చిత్రం రూపొందుతోంది. వరుస ఫ్లాప్‌లతో సతమతమవుతున్న మహేష్‌కు సరైన హిట్ ఇవ్వాలనే కసితో కొరటాల ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అయితే తొలిచిత్రం ‘మిర్చి’ అంటూ పూర్తి మాస్ టైటిల్‌ను పెట్టిన కొరటాల... మహేష్ చిత్రానికి మాత్రం శ్రీమంతుడు అనే సాఫ్ట్ టైటిల్‌ను పెట్టడంతో ప్రిన్స్ అభిమానులు కాస్త నిరాశకు లోనయ్యారు. అయితే ఈ కథకు ఈ టైటిలే యాప్ట్ అవుతుందని అభిమానులకు సర్ధిచెప్పాడు దర్శకుడు. ఏది ఏమైనా టైటిల్ సాఫ్ట్‌గా వున్నా... మహేష్‌కు స్ట్రాంగ్ హిట్ ఇవ్వాలని అభిమానులు కొరటాల శివను కోరుతున్నారట...

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019