Advertisementt

జ్యోతిక ఫస్ట్‌లుక్‌ విడుదలైంది....!

Tue 10th Mar 2015 09:48 AM
jyothika,surya,how old are u remake,36 vayadinele  జ్యోతిక ఫస్ట్‌లుక్‌ విడుదలైంది....!
జ్యోతిక ఫస్ట్‌లుక్‌ విడుదలైంది....!
Advertisement
Ads by CJ

‘చంద్రముఖి, ఠాగూర్‌, మాస్‌, షాక్‌’ వంటి పలు చిత్రాల ద్వారా టాలీవుడ్‌ ప్రేక్షకులను అలరించిన నటి జ్యోతిక. తర్వాత తమిళస్టార్‌ సూర్యను వివాహం చేసుకొని నటనకు దూరయింది. ఆమె ఏడేళ్ల సినిమా విరామం తర్వాత సెకండ్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభిస్తోంది. మలయాళంలో హిట్‌ అయిన ‘హౌఓల్డ్‌ ఆర్‌ యు’ అనే సినిమా తమిళ రీమేక్‌లో జ్యోతిక నటిస్తోంది. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ‘36 వయధినెలే’ అనే టైటిల్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. దీనికి 36ఏళ్ల తర్వాత అని తెలుగులో అర్థం. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. తెలుగులో కూడా ఈ చిత్రాన్ని డబ్‌ చేసే ఉద్దేశ్యంలో నిర్మాత ఉన్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ