Advertisementt

‘నాని’ని మర్చిపోలేకపోతున్న మహేష్‌...!

Tue 10th Mar 2015 06:18 AM
mahesh babu,nani movi,aj surya,lingu swamy,maniratnam  ‘నాని’ని మర్చిపోలేకపోతున్న మహేష్‌...!
‘నాని’ని మర్చిపోలేకపోతున్న మహేష్‌...!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో మహేష్‌బాబు సూపర్‌స్టార్‌. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలని దర్శకనిర్మాతలే కాదు... హీరోయిన్లు కూడా ఆశపడుతుంటారు. విచిత్రంగా మహేష్‌తో సినిమా చేయాలని తమిళ దర్శకులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు. గతంలో మహేష్‌ హీరోగా తమిళ దర్శకుడు ఎస్‌.జె.సూర్య దర్శకత్వంలో ‘నాని’ చిత్రం వచ్చింది. ప్రయోగాత్మకంగా వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఘోరంగా విఫలమైంది. అప్పటినుండి మహేష్‌ కష్టమో నష్టమో తెలుగు డైరెక్టర్స్‌తోనే సర్దుకుపోతున్నాడు. ఇటీవల మణిరత్నం వంటి లెజెండ్‌ మహేష్‌, నాగార్జున కాంబినేషన్‌లో ఓ మల్టీస్టారర్‌ చేయాలని భావించాడు. నాగ్‌ ఒప్పుకున్నప్పటికీ మహేష్‌ మాత్రం నో చెప్పాడు. ఇక శంకర్‌ కూడా ‘3ఇడియట్స్‌’ సినిమా రీమేక్‌లో మహేష్‌ని అడిగాడు. అందుకు కూడా ఆయన నో చెప్పాడు. ఇక లింగుస్వామి వంటి దర్శకులైతే మహేష్‌ ఎప్పుడు డేట్స్‌ ఇస్తాడా? అని ఎదురుచూపులు చూస్తున్నారు. కాగా తమిళంలో విజయ్‌, మోహన్‌లాల్‌లతో ‘జిల్లా’ చిత్రాన్ని తీసిన నీసన్‌ మహేష్‌, మోహన్‌లాల్‌, ఆర్యలతో ఓ మల్టీస్టారర్‌ను తెలుగు,తమిళ భాషల్లో తీయాలని కలలు కంటున్నాడట. మిగిలిన ఇద్దరూ ఓకే చెప్పినప్పటికీ మహేష్‌ మాత్రం ఇంకా గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వలేదు. మరి చివరకు ఈ సినిమా ఏ మలుపు తిరుగుతుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల ఓ సర్వేలో తమిళనాడులో అత్యధిక ఫాలోయింగ్‌ ఉన్న తెలుగు హీరో ఎవరు? అనే పోటీ నిర్వహిస్తే అందులో మహేష్‌ మొదటిస్థానంలో నిలిచిన సంగతి తెలిసిందే. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ