మహేష్‌ చిత్రంతోనైనా లక్‌ మారుతుందా?

అప్‌కమింగ్‌ హీరోలకు తాము నటించే చిత్రాల ద్వారా కేవలం కొద్దిమందికి మాత్రమే చేరువకాగలరు. అదే వారు స్టార్‌హీరోల చిత్రాలలో చిన్నపాటి రోల్స్‌ చేసినా కూడా ఎక్కువ మందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది. దీనికి ఉదాహరణగా హీరో రాజాను చెప్పుకోవచ్చు. హీరోగా కొద్దిపాటి గుర్తింపును తెచ్చుకున్న ఆయన మహేష్‌బాబు ‘అర్జున్‌’ చిత్రంలో చేసిన తర్వాతే ఎక్కువమందికి చేరువయ్యాడు. ఇప్పుడు అలాంటి అదృష్టమే యువహీరో రాహుల్‌ రవీంద్రన్‌కు వచ్చింది. ‘అందాలరాక్షసి, అలా ఎలా’ చిత్రాల్లో హీరోగా నటించిన ఆయన మహేష్‌బాబు`కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘శ్రీమంతుడు’ చిత్రంలో కీలకపాత్రను చేయనున్నాడు. ఈ విషయాన్ని కొరటాల శివ కూడా కన్‌ఫర్మ్‌ చేశాడు. మరి ఈ చిత్రంతోనైనా రాహుల్‌కు మంచి గుర్తింపు వస్తుందని ఆశిద్దాం.....!

rahul ravindran
srimanthudu
mahesh babu
koratala siva