చిన్నచిన్న పాత్రలతో కెరీర్ స్టార్ట్ చేసి ఆ తర్వాత విలన్‌గా, హీరోగా మారిన నటుడు జె.డి.చక్రవర్తి. ఆ తర్వాత వర్మ ప్రియశిష్యుల్లో ఒకనిగా మారి డైరెక్టర్‌గా స్థాయికి ఎదిగాడు. అయితే ఇటీవలకాలంలో తన స్వయంకృతాపరాధంతో మరలా ఫామ్ కోల్పోయిన జె.డి.చక్రవర్తి త్వరలో మరలా విలన్‌గా నటించనున్నాడు. అదీ ఓ మలయాళ చిత్రంలోకావడం విశేషం. ఈ చిత్రంలో ఆయన నయనతారకు ప్రియుడిగా, నెగటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడు. గతంలో వచ్చిన రవితేజ ‘దుబాయ్‌శ్రీను’ చిత్రంలో జె.డి. నయనతారకు అన్నయ్యగా నటించిన సంగతి తెలిసిందే. సిద్దిక్ దర్శకత్వంలో నటిస్తున్న ‘భాస్కర్ ది రాస్కెల్’ చిత్రంలో జె.డి.చక్రవర్తి నయనతారకు ప్రేమికుడిగా, నెగటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడు.





Loading..