Advertisementt

'దండయాత్ర'కు సిద్ధమైన ఎన్టీఆర్..!

Thu 05th Mar 2015 11:23 PM
dandayathra,temper,ntr,bvsn prasad,devisriprasad  'దండయాత్ర'కు సిద్ధమైన ఎన్టీఆర్..!
'దండయాత్ర'కు సిద్ధమైన ఎన్టీఆర్..!
Advertisement
Ads by CJ

రీసెంట్‌గా ‘టెంపర్‌’ ఇచ్చిన కిక్‌లో ఉత్సాహంగా ఉన్న ఎన్టీఆర్‌ తాజాగా సుకుమార్‌ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బేనర్‌లో భారీ నిర్మాత బివిఎస్‌ఎన్‌ ప్రసాద్‌ నిర్మాతగా ఓ చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి ‘దండయాత్ర’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ‘టెంపర్‌’ చిత్రంలో ‘దండయాత్ర.. ఇది దయాగాడి దండయాత్ర’ అనే డైలాగ్‌ బాగా పాపులర్‌ అయిన నేపథ్యంలో తమ చిత్రానికి ‘దండయాత్ర’ అనే టైటిల్‌ను పెడితే కరెక్ట్‌గా యాప్ట్‌ అవుతుందని యూనిట్‌ భావిస్తోందిట. కాగా ఈ చిత్రం తండ్రి కొడుకుల అనుబంధం నేపథ్యంలో కొనసాగనుంది. ఎన్టీఆర్‌కు తండ్రిగా జగపతిబాబు నటిస్తున్నట్లు సమాచారం. దేవిశ్రీప్రసాద్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ లుక్‌, గెటప్‌, క్యారెక్టరైజేషన్‌ విభిన్నంగా ఉంటాయని తెలుస్తోంది...!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ