Advertisementt

బాలీవుడ్ రీమేక్ లో దగ్గుబాటి హీరో..!

Thu 05th Mar 2015 08:22 AM
venkatesh,drusyam,akshay kumar,special 26,anupam kher  బాలీవుడ్ రీమేక్ లో దగ్గుబాటి హీరో..!
బాలీవుడ్ రీమేక్ లో దగ్గుబాటి హీరో..!
Advertisement
Ads by CJ

'కలియుగ పాండవులు' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై, ఎన్నో హిట్ సినిమాలలో నటించిన స్టార్ హీరో వెంకటేష్. ప్రస్తుతం ఆయన మల్టీస్టారర్, ఫ్యామిలీ ఎంటర్ టైన్మెంట్ సినిమాలలో ఎక్కువగా కనిపిస్తున్నాడు. తెలుగు ఇండస్ట్రీలో కాంపిటిషన్ ఎక్కువగా ఉన్న ఈరోజుల్లో 'దృశ్యం' లాంటి కమర్షియల్ సినిమాలో నటించి సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే ప్రస్తుతం వెంకటేష్ ఓ బాలీవుడ్ సినిమా రీమేక్ లో నటించనున్నాడని వార్తలు వస్తున్నాయి. అక్షయ్ కుమార్, అనుపమ్ ఖేర్ ముఖ్యమైన పాత్రల్లో నటించిన 'స్పెషల్ 26' సినిమా బాలీవుడ్ లో హిట్ టాక్ సంపాదించుకుంది. ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే అనుపమ్ ఖేర్ పాత్రలో వెంకటేష్ నటిస్తున్నాడని సమాచారం. అక్షయ్ కుమార్ పాత్రలో ఎవరు నటించానున్నారో తెలియాల్సివుంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ