Advertisementt

చరిత్ర పాఠాలు చదువుతోన్న టాలీవుడ్ హీరోలు...!

Tue 03rd Mar 2015 04:03 AM
history,magadheera,prabhas,rana,varuntej,bahubali  చరిత్ర పాఠాలు చదువుతోన్న  టాలీవుడ్ హీరోలు...!
చరిత్ర పాఠాలు చదువుతోన్న టాలీవుడ్ హీరోలు...!
Advertisement
Ads by CJ

మన హీరోలు చిన్ననాడు బళ్ళలో చరిత్ర పాఠాలు సరిగా చదివారో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం హిస్టరీ పాఠాలు బాగానే చదువుతున్నారు. పీరియాడిక్, హిస్టారికల్, చందమామ కధల వంటి స్టోరీలతో  రూపొందుతోన్న చిత్రాల్లో నటించడానికి బాగా ఆసక్తి కనబరుస్తున్నారు. అప్పుడెప్పుడో వచ్చిన రామ్ చరణ్ 'మగధీర' చిత్రం చరిత్రను తిరగరాసింది. ఇప్పుడు అదే రూటు లో ప్రభాస్, రానా, అనుష్క, వరుణ్ తేజ్ వంటి హీరోలు ముందుకు వెళుతున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, అనుష్క, రానా వంటి నటులు కీలకపాత్రల్లో నటిస్తున్న 'బాహుబలి', అచ్చమైన తెలుగు చరిత్రలోని 'రుద్రమదేవి' చిత్రంలో అనుష్క, రానా, అల్లుఅర్జున్ లు నటిస్తున్నారు. ఇటీవల ప్రారంభమైన వరుణ్ తేజ్ రెండో సినిమా 'కంచె' కూడా ఇలాంటి చిత్రమే. ఈ కధ రెండో ప్రపంచ యుద్ధం నాటి కాలంలో జరిగిన ఓ ప్రేమకధా చిత్రమని సమాచారం. ఇందులో వరుణ్ తేజ్ ఆర్మీ సోల్జర్ గా నటిస్తున్నాడు. మరి ఈ చరిత్ర పాఠాలను తెరకెక్కించడం అంటే బహుకష్టంతో కూడుకున్న పని.. మరి దీనిలో ఎంత మంది సక్సెస్ అవుతారో వేచిచూడాల్సివుంది....!

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ