Advertisementt

రీఎంట్రీకి జెనిలియా రెడీ..!

Mon 02nd Mar 2015 03:42 AM
genelia,re entry,bommarillu,ritesh deshmukh wife  రీఎంట్రీకి  జెనిలియా రెడీ..!
రీఎంట్రీకి జెనిలియా రెడీ..!
Advertisement
Ads by CJ

ఒకప్పుడు తన నటనతో గ్లామర్ తో కుర్రకారు హృదయాలను దోచుకుని 'బొమ్మరిల్లు' సహా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన హీరోయిన్ జెనిలియా. ఆ తర్వాత ఆమె బాలీవుడ్ కి వెళ్ళి అక్కడ రితేష్ దేశ్ ముఖ్ ని ప్రేమించింది. దాదాపు 10 ఏళ్ల పాటు సాగిన వీరి ప్రేమ ప్రయాణం ఎట్టకేలకు 2012లో వివాహంగా మారింది. ఆ తర్వాత ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. అతనికి రియాన్ దేశ్ ముఖ్ అనే పేరు పెట్టింది. బిడ్డ పుట్టినప్పటి నుండి సినిమాలకు దూరంగా ఉన్న ఆమె త్వరలో మరలా రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమని ప్రకటించింది. మరి ఆమె రీ ఎంట్రీ సౌత్ సినిమాలతోనా? లేక బాలీవుడ్ సినిమతోనా? అనేది తేలాల్సివుంది. మొత్తానికి హీరోయిన్ల కొరతను ఎదుర్కొంటున్న మన  ఏజ్డ్ హీరోలకు ఈమె  బెస్ట్ ఆప్షన్ గా మారనుందని మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ