Advertisement

బడ్జెట్‌ చూసి సంతోషంలో జగన్‌.??

Sun 01st Mar 2015 04:09 AM
central budget,chandrababu naidu,jaganmohan reddy,bjp,joining  బడ్జెట్‌ చూసి సంతోషంలో జగన్‌.??
బడ్జెట్‌ చూసి సంతోషంలో జగన్‌.??
Advertisement

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి దగ్గరవడానికి తెలుగు పార్టీలు తహతహలాడుతున్నాయి. ఇటు టీఆర్‌ఎస్‌ అటు వైసీపీలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇక ఈ పార్టీల రాకను అటు చంద్రబాబు నాయుడు ఇటు వెంకయ్యనాయుడు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నారు. ఇప్పుడు ఇదే ఏపీ కొంపముంచినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. తాము ఏపీకి తగినంత నిధులివ్వకున్నా పోయేదేమీ లేదని కేంద్రం భావిస్తున్నట్లు వారు అభిప్రాయపడుతున్నారు. ఏపీకి తగినంత ప్రాధాన్యత ఇవ్వకున్నా.. వైసీపీని చూసి టీడీపీ ఎన్డీఏ నుంచి తొలగిపోయే అవకాశం లేదని, ఒకవేళ ఎన్డీఏకు టీడీపీ దూరమైనప్పటికీ అటు టీఆర్‌ఎస్‌ ఇటు వైసీపీలు కూడా తమలో చేరుతాయని మోడీ సర్కారు ఆలోచిస్తున్నట్లు వారు చెబుతున్నారు. అందుకే అటు రైల్వే బడ్జెట్‌లోనే ఇటు ఆర్థిక బడ్జెట్‌లోనూ ఏపీకి తగినంత ప్రాధాన్యత ఇవ్వకున్నా చంద్రబాబు గట్టిగా మాట్లాడలేకపోతున్నారని వారు చెబుతున్నారు. అధికారంలోకి వచ్చినప్పటినుంచి మొదటిసారిగా శనివారం కేంద్రంపై బహిరంగంగా చంద్రబాబు నిరసన వ్యక్తం చేశారు. ఇలాగే మెల్లిమెల్లిగా బీజేపీకి టీడీపీ దూరమవుతే.. జగన్‌ కోరుకుంది జరిగిపోయే అవకాశలున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. అందుకే బడ్జెట్‌పై కూడా జగన్‌ స్పందించలేదని వారు చెబుతున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement