‘రేయ్‌’ ఈసారి కూడా కష్టమే....!

Wed 25th Feb 2015 05:31 AM
sai dharamtej,rey movie,pillanuvvuleni jeevitham,lion  ‘రేయ్‌’ ఈసారి కూడా కష్టమే....!
‘రేయ్‌’ ఈసారి కూడా కష్టమే....!
Advertisement
Ads by CJ

మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ను హీరోగా పరిచయంచేస్తూ దర్శకనిర్మాత వై.వి.ఎస్‌.చౌదరి స్వీయ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం ‘రేయ్‌’. అయితే ఈ చిత్రం పూర్తయినప్పటికీ ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఇప్పటికీ విడుదల కాలేదు. దాంతో సాయిధరమ్‌తేజ్‌ నటించిన రెండో చిత్రం ‘పిల్లా.. నువ్వులేని జీవితం’ చిత్రం మొదటగా విడుదలై మంచి విజయం సాధించింది. దీంతో ‘రేయ్‌’ చిత్రం బిజినెస్‌కు కొంత ఊపు వచ్చింది. అయినా కూడా ఇప్పటికీ ఈ చిత్రం విడుదలకు నోచుకోవడం లేదు. తాజాగా ఈ చిత్రాన్ని మార్చి 27న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.కానీ ప్రస్తుతం మార్చి చివరివారంలో రావడానికి ఆల్‌రెడీ బాలయ్య ‘లయన్‌’, గుణశేఖర్‌ ‘రుద్రమదేవి’లు పోటీ పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ చిత్రం మార్చి 27న కూడా విడుదలయ్యే అవకాశాలు లేవని ట్రేడ్‌వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ