Advertisement

వైసీపీపై మండిపడ్డ రాజధాని రైతులు..!!

Tue 24th Feb 2015 10:45 PM
ap capital,ysr congress leaders,formers,angrey  వైసీపీపై మండిపడ్డ రాజధాని రైతులు..!!
వైసీపీపై మండిపడ్డ రాజధాని రైతులు..!!
Advertisement

ఏపీలో రాజధాని భూసేకరణకు సంబంధించి వైసీపీ నాయకులు రచ్చరచ్చ చేస్తున్నారు. రైతులనుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నారంటూ ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. ఇదే తరుణంలో వైసీపీ శాసనసభాపక్ష నేతలు తుళ్లూరు ప్రాంతంలో సంచరించారు. ప్రభుత్వానికి భూములివ్వొద్దని, తాము అండగా ఉంటామని ఉపన్యాసాలివ్వబోయారు. దీన్ని అడ్డుకున్న స్థానిక రైతులు తాము ఇష్టపూరితంగానే ప్రభుత్వానికి భూములిస్తున్నామని, మీరు అడ్డుకోవాల్సిన అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అవాక్కైయిన వైసీపీ నాయకులు స్థానికులకు నచ్చజెప్పబోయారు. అయినా వారు వినిపించుకోకపోవడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. రాష్ట్ర అభివృద్ధికి పాటుపడకపోయినా పర్వలేదు కాని ఇలా అడ్డుకోవద్దంటూ స్థానికులు వైసీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము అండగా ఉంటాం.. ఉద్యమం చేద్దామన్న స్థానికులు తిరగబడటంపై అవాక్కైన వైసీపీ నాయకులు ఇంటిబాటపట్టారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement