రకుల్‌ సక్సెస్‌ సీక్రెట్‌...!

Mon 23rd Feb 2015 09:41 AM
rakul preeth singh,success secret,producers,25 lakhs remuneration  రకుల్‌ సక్సెస్‌ సీక్రెట్‌...!
రకుల్‌ సక్సెస్‌ సీక్రెట్‌...!
Advertisement
Ads by CJ

హీరోయిన్ల హవా కేవలం కొద్ది రోజులే ఉంటుంది.సో.. గ్లామర్‌, డిమాండ్‌ ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని ఎక్కువ మంది చూస్తారు. కానీ ప్రస్తుతం టాలీవుడ్‌ను ఏలుతోన్న రకుల్‌ప్రీత్‌సింగ్‌ అందుకు విరుద్దంగా రివర్స్‌లో వెలుతోంది. అందువల్లే ఆమెకు అవకాశాలు ఎక్కువగా వస్తున్నాయని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. పూర్తిస్థాయిలో సెటిల్‌ అయిన తర్వాత డబ్బు దానంతట అదే వస్తుందనే పాలసీ ఆమె సక్సెస్‌కు కీలకమైన సీక్రెట్‌ అంటున్నారు. వరుసగా హిట్స్‌ వస్తున్నప్పటికీ ఆమె ఇప్పటికీ కేవలం 30లక్షలు మాత్రమే తీసుకొంటుందట. మొదట్లో 25 లక్షలు తీసుకున్న ఈ అమ్మడు భారీ ఆఫర్లు వచ్చినా కూడా ఎంత ఇస్తే అంతకు సిద్దపడి నిర్మాతలను సంతోషపరుస్తోందని, ఆమె షూటింగ్‌ సమయంలో కూడా తన పని తాను చేసుకుపోతుందే తప్ప ఆ హోటల్‌లోనే  దిగాలి.. ఏ ఫుడ్‌ చేయించుకోవాలి.. ఫలానా విమానంలోనే తిరగాలి.. వంటి కండీషన్స్‌ పెట్టకుండా ఉండటమే ఆమె సక్సెస్‌ సీక్రెట్‌ అంటున్నారు. సో.. నిర్మాతలకు అనుగుణంగా వెలుతోన్న ఆమెకు ఇక అవకాశాలకు ఇక కొదవేముంది.. అంటున్నాయి సినీ వర్గాలు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ