Advertisementt

నిజంగానే కేసీఆర్‌ మీడియా మెడలు వంచుతున్నాడా..??

Fri 20th Feb 2015 05:34 AM
kcr,telangana,secretariate,journalists ban,  నిజంగానే కేసీఆర్‌ మీడియా మెడలు వంచుతున్నాడా..??
నిజంగానే కేసీఆర్‌ మీడియా మెడలు వంచుతున్నాడా..??
Advertisement
Ads by CJ

మీడియా మెడలు వంచుతామని ఇది వరకే ప్రకటించిన కేసీఆర్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నట్లు కనబడుతోంది. తాజాగా సచివాలయంలో మీడియా ప్రతినిధుల ప్రవేశానికి ఆంక్షలు విధించాలన్న సర్కారు నిర్ణయంపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమానికి అన్ని విధాలుగా సహకరించి కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీడియాను మాత్రం వద్దనుకోవడం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. అధికారంలోకి రాగానే కేసీఆర్‌ తన రాచరికపు బుద్ధులు చూపిస్తున్నాడని, సచివాలంయలోకి మీడియా ప్రతినిధులు వస్తే ఏం జరుగుతుందో స్పష్టంగా చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంత్రుల అవినీతి కార్యకలాపాలకు తాము అడ్డు అనే టీ-సర్కారు ఈ నిర్ణయం తీసుకుంటోందని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని తేల్చిచెప్పారు. ఇప్పటికీ కేసీఆర్‌ ఈ నిర్ణయంపై ముందుకు వెళతారా లేక వెనక్కి తగ్గుతారా అనేది తెలియాల్సి ఉంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ