ఎన్టీఆర్ పై ఉన్న విమర్శలకు సమాధానం..!

Fri 20th Feb 2015 05:17 AM
ntr,temper,bandla ganesh,brundavanam movie  ఎన్టీఆర్ పై ఉన్న విమర్శలకు సమాధానం..!
ఎన్టీఆర్ పై ఉన్న విమర్శలకు సమాధానం..!
Advertisement
Ads by CJ

‘టెంపర్‌’ ఘనవిజయం సాధిస్తున్న సమయంలో బండ్ల గణేష్‌ తన అత్యుత్సాహాన్ని చూపిస్తున్నాడని నందమూరి అభిమానులు గుస్సాగా ఉన్నారు. ఇటీవల బండ్ల గణేష్‌ ఓ టీవీ చానెల్‌ ఇంటర్వ్యూలో సాధారణంగా ఎన్టీఆర్‌కు లేడీస్‌ ఫాలోయింగ్‌ లేదని, ఆ లోటును తన సినిమా భర్తీ చేస్తోందని చెప్పాడు. అయితే ఎన్టీఆర్‌కు ‘బృందావనం’ తర్వాత లేడీస్‌లో మంచి ఫాలోయింగ్‌ వచ్చిందని, కానీ బండ్ల గణేష్‌ ఇలా మాట్లాడటం సరికాదని ఎన్టీఆర్‌ అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. మరోవంక ఈ చిత్రం ఎన్టీఆర్‌పై ఉన్న పలు లోపాలను తప్పు అని నిరూపించింది. తెలంగాణలో కన్నా ఆంధ్రా, సీడెడ్‌లో ఎన్టీఆర్‌కు మంచి ఫాలోయింగ్‌ ఉందనే  భావన అందరిలో ఉండేది. కానీ ‘టెంపర్‌’ చిత్రం మాత్రం తెలంగాణలో చాలా స్ట్రాంగ్‌గా నడుస్తోంది. ఇక ఎన్టీఆర్‌కు ‘ఎ’ సెంటర్స్‌లో పెద్దగా అభిమానులు లేరని, ఆయనకు బి,సి సెంటర్లలోనే ఎక్కువ ఫాలోయింగ్‌ ఉంది అని అందరూ అంచనా వేసేవారు. కానీ ‘టెంపర్‌’ చిత్రం బి,సి సెంటర్లలో కంటే ‘ఏ’ సెంటర్లలోనే బాగా రన్‌ అవుతోంది. సో... ఎన్టీఆర్‌పై ఉన్న పలు విమర్శలకు ‘టెంపర్‌’ చిత్రం చెక్‌పెట్టి, విశ్లేషకుల అంచనాలు తప్పు అని రుజువుచేస్తోంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ