Advertisementt

చైతు ప్లేస్ కొట్టేసిన రానా..!

Fri 20th Feb 2015 03:38 AM
rana,banglore days,chaitu,kollywood,dil raju,pvp  చైతు ప్లేస్ కొట్టేసిన రానా..!
చైతు ప్లేస్ కొట్టేసిన రానా..!
Advertisement
Ads by CJ

మలయాళంలో హిట్ అయిన 'బెంగుళూర్ డేస్' చిత్రాన్ని తెలుగులో దిల్ రాజు, పి.వి.పి సంయుక్తంగా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు. తెలుగులో ఈ సినిమా టైటిల్ గా 'హైదరాబాద్ డేస్' అనుకుంటున్నారని సమాచారం. అయితే ఈ సినిమా కాస్టింగ్ విషయంలో చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయి. మొదటగా అనుకున్నట్లు ఈ సినిమాలో సమంత, సిద్ధార్థ్ నటించట్లేదు. సమంత స్థానంలో శ్రీదివ్య నటించబోతోంది. ఆర్య, నిత్యమీనన్ లతోపాటు చైతు కుడా ఈ సినిమాలో నటిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే చైతు కన్నా రానా ఈ సినిమాకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడని భావించి రానా ని కన్ఫర్మ్ చేసారని టాలీవుడ్ టాక్. కోలీవుడ్ లో రానాకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ వల్లే తనను సెలెక్ట్ చేసారట. ఈ విషయం గురించి త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు.  

Advertisement




Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ