గ్లామరస్ పాత్రలలోను, పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ పాత్రలలో నటించి ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ నయనతార. అటు కోలీవుడ్ లోను, ఇటు తెలుగు ఇండస్ట్రీ సినిమాలలో నటిస్తూ తనకంటూ ప్రత్యేక స్థానాన్ని క్రియేట్ చేసుకుంది. బాలయ్య తో వరుస అవకాశాలు అందుకొని హిట్స్ కొట్టింది. నయనకి ఎంత క్రేజ్ ఉందంటే కోటిన్నర రెమ్యునరేషన్ ఇవ్వడానికి కూడా నిర్మాతలు వెనుకడుగు వేయట్లేదు. రీసెంట్ గా నయనతారను ఓ నిర్మాత కలిసి సినిమాలో నటించమని అడిగారట. అప్పటినుంచి నయన ఆయన మీద కస్సుబుస్సులాడుతోందట. ఎందుకంటే ఆ నిర్మాత ఓ తమిళ హీరోకు అక్క పాత్రలో నటించమని అడిగారంట. దీంతో నయన ఆయనపై చాలా కోపంగా ఉందట.





Loading..