దాసరి తర్వాత పూరీనే అంటున్నారు...!

Thu 19th Feb 2015 09:14 AM
poorijagannath,dasari narayanarao compliment,climax scenes  దాసరి తర్వాత పూరీనే అంటున్నారు...!
దాసరి తర్వాత పూరీనే అంటున్నారు...!
Sponsored links

నిన్నటితరం దర్శకుల్లో ఒక చిత్రాన్ని అతి తక్కువ రోజుల్లో పూర్తి చేసి, ఒకేసారి రెండు మూడు చిత్రాలను కూడా తీసిన దర్శకుడు దర్శకరత్న దాసరి, స్పీడ్ విషయంలో నేటి తరంలో పూరీ ఆయన్ను ఫాలో అవుతున్నాడు. 'టెంపర్' చిత్రం విషయంలో పూరీజగన్నాధ్ దర్శకత్వ ప్రతిభకు అనేక ప్రశంసలు లభిస్తున్నాయి. హీరో క్యారెక్టరైజేషన్, డైలాగ్స్, టేకింగ్ వంటి అంశాలు ఆయనకు ఎంతో పేరును తీసుకుని వస్తూ అందరి చేత ప్రశంసలు అందుకుంటున్నాడు పూరీ. క్లైమాక్స్ సీన్స్ లో పూరీ ప్రతిభ చూసి అందరూ అబ్బురపడుతున్నారు.  ఈ చిత్రం విషయంలో పూరీకి దర్శకరత్నదాసరి నుండి ప్రశంసలు అందాయి. ఈ విషయాన్ని పూరీ స్వయంగా తన సోషల్ నెట్ వర్క్ పేజీలో పేర్కొన్నాడు. ఈ సినిమా చూసిన తర్వాత దాసరి పూరీని ఉద్దేశించి 'నా వరసుడివి నువ్వే' అంటూ పూరీని ప్రశంసించాడట. నా జీవితంలో బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఇది. సినిమా విజయం కంటే చాలా పెద్దది ఇది అని పూరీ పేర్కొన్నాడు.  

Sponsored links

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019