Advertisementt

దసరాను టార్గెట్ చేస్తోన్న మెగాహీరోలు..!

Thu 19th Feb 2015 04:37 AM
ram charan,pawan kalyan,gabbar singh2,october month  దసరాను టార్గెట్ చేస్తోన్న మెగాహీరోలు..!
దసరాను టార్గెట్ చేస్తోన్న మెగాహీరోలు..!
Advertisement
Ads by CJ

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 'గోవిందుడు అందరివాడేలే' చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకుని చేస్తున్న చిత్రం షూటింగ్ మార్చి 5న లాంఛనంగా  ప్రారంభంకానుందని, మార్చి 16 నుండి రెగ్యులర్ షూటింగ్ ఉంటుందని అఫీషియల్  ప్రకటన వచ్చేసింది. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 15న అంటే దసరాకు ఓ వారం ముందుగా రిలీజ్ చేయాలని కూడా నిర్ణయించుకున్నారు. అయితే బాబాయ్ నటించనున్న 'గబ్బర్ సింగ్2' విషయంలో మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మార్చి 14 నుండి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుందని, ఈ చిత్రాన్ని కూడా అక్టోబర్ లోనే విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఫిల్మ్ నగర్ లో వినిపిస్తుంది. అయితే బాబాయ్, అబ్బాయ్ లు ఇద్దరు ఒకేసారి బరిలో ఉండరనేది  వాస్తవం. రామ్ చరణ్ డేట్ ఫిక్స్ అయింది కాబట్టి ఓ పది రోజులు ముందుగా కానీ, లేదా తర్వాత కానీ బాబాయ్ చిత్రం విడుదలయ్యే అవకాశం మాత్రం ఉంది. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ