Advertisement

జలసాలకు వందల కోట్లు.. చివరకు కటకటాల్లోకి..!!

Tue 17th Feb 2015 02:40 AM
deccan chronicle,venkatramreddy,abi,jalasalu  జలసాలకు వందల కోట్లు.. చివరకు కటకటాల్లోకి..!!
జలసాలకు వందల కోట్లు.. చివరకు కటకటాల్లోకి..!!
Advertisement

దక్కన్‌ క్రానికల్‌ దక్షిణ భారత్‌నుంచి పేరన్నికగన్న ఆంగ్ల పత్రిక. ఈ పత్రికకు ప్రస్తుతం ఒకప్పటి ఆదరణ కరువైనప్పటికీ ఇంకా కొందరు పాఠకులు దక్కన్‌ క్రానికల్‌నే చదవడానికే ఇష్టపడుతుంటారు. అయితే ఈ పత్రిక చైర్మన్‌ వెంకట్రామిరెడ్డి, ఎమ్‌డీ వినాయక్‌లను సీబీఐ అధికారులు అరెస్టు చేసిన ఘట్టంపై పలు కథనాలు వెలువడ్డాయి. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడ్డ వెంకట్రామిరెడ్డి కోట్లను నీళ్లలా ఖర్చు చేశావారని, గుర్రపు పందాలు, ఖరీదైన కార్ల కొనుగోలుకు వందల కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అంతేకాకుండా అద్దె విమానాల్లో తిరగడం, ఐపీఎల్‌లో పెట్టుబడులు పెట్టి తీవ్రంగా నష్టపోవడం వారిని ఆర్థిక సమస్యల్లోకి నెట్టింది. ఇక కింగ్‌ఫిషర్‌ యజమాని విజయమల్యాలాగే వెంకట్రామిరెడ్డి కూడా విలాసాల బాట పట్టారని, చివరకు కింగ్‌ ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ పరిస్థితిలాగే డీసీ కూడా నష్టాల్లో కూరుకుపోయిందని వారంటున్నారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement