Advertisementt

పవన్. మహేష్ లు కలుస్తారా..!

Mon 16th Feb 2015 12:05 PM
pawan kalyan,mahesh babu,trivikra,son of sathya murthy  పవన్. మహేష్ లు కలుస్తారా..!
పవన్. మహేష్ లు కలుస్తారా..!
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ - మహేష్ బాబుల మధ్య నెంబర్ వన్ పోరు నడుస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య కూడా మాటకు మాట తప్పడం లేదు. అయితే నిశితంగా పరిశీలిస్తే వీరిలో చాలా  విషయాలు కామన్ గా కనిపిస్తుంటారు. త్వరలో వీరిద్దరూ ఒకే వేదికపైకి వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అయితే వీరిని కలిపి ఒకే వేదికపై నిలిపే బృహత్తర బాధ్యత మాత్రం ఇద్దరికీ ఎంతో దగ్గరి స్నేహితుడైన డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ పై ఉందని చెబుతున్నారు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లుఅర్జున్ హీరోగా 'సన్నాఫ్ సత్యమూర్తి' అనే చిత్రం రూపొందుతోంది. చిత్రీకరణ ముగింపు దశకు వచ్చిన ఈ చిత్రం ఆడియోను మార్చి 14న విడుదల చేయనున్నారని సమాచారం. దీనికి పవన్, మహేష్ ఇద్దరినీ త్రివిక్రమ్ అతిధులుగా  పిలిచే అవకాశం ఉందని, అదే జరిగితే ఇద్దరు అభిమానుల మధ్య కూడా స్నేహపూరిత వాతావరణం నెలకొంటుందని అందరూ ఆశిస్తున్నారు. మరి ఈ వార్త నిజమవుతుందో? లేదో? చూడాల్సివుంది...!  

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ