Advertisementt

'టెంపర్'తో దశ తిరిగింది..!

Mon 16th Feb 2015 07:32 AM
tmper,sequel,gemini tv,satellite rights  'టెంపర్'తో దశ తిరిగింది..!
'టెంపర్'తో దశ తిరిగింది..!
Advertisement
Ads by CJ

'టెంపర్' విడుదలకు ముందు ఎన్టీఆర్, పూరీజగన్నాధ్, బండ్లగణేష్ లకే కాదు... కాజల్ కు కూడా పరిస్థితులు బాగాలేవు. అయితే ఈ చిత్రం అందరికి అనుకోని అదృష్టాన్ని తీసుకొచ్చి, అందరినీ ఒడ్డున పడేసింది. ఇప్పటికీ 'దయాగాడి దండయాత్ర' బాక్సాఫీస్ ను ఊపేస్తుంది. ఇక ఈ చిత్రం సాధించిన విజయంతో ఎంతో ఉత్సాహంగా ఉన్న నిర్మాత బండ్లగణేష్ 'టెంపర్' చిత్రానికి పార్ట్ 2 చేస్తానని ప్రకటించాడు. ఈ వార్త నందమూరి అభిమానులకు ఓ తీపి వార్తే. ఇక ఈ చిత్రం జెమినీ చానెల్ కు కూడా అనుకోని బంపర్ఆఫర్ అయింది. ఈ చిత్రంపై షూటింగ్ సమయంలో నెగెటివ్ వార్తలు వస్తున్నప్పటికీ జెమిని చానెల్ ధ్యైరం చేసి ఈ చిత్రం శాటిలైట్ హక్కులను 7 కోట్లకు దక్కించుకుంది. అదే సినిమా విడుదలైన తర్వాత.. అంటే ఇప్పుడైతే ఆ హక్కుల రేటు 10 కోట్లకు పైగానే పలికేవి. దీంతో జెమిని జాక్ పాట్ కొట్టిందని అంటున్నారు. మొత్తానికి ఎన్టీఆర్ గత రెండు మూడు చిత్రాలకు వచ్చిన  నష్టాలను ఒక్క 'టెంపర్' చిత్రం తీర్చేస్తోందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ