‘తుపాకి’ తర్వాత మురుగదాస్`విజయ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన ‘కత్తి’ చిత్రం అనేక ఆటు పోట్లు ఎదుర్కొని చివరగా తమిళంలో ఘనవిజయం సాధించింది. ఇందులో సమంత హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని మొదట తెలుగులో అనువాదం చేయాలని భావించి హక్కులు తీసుకున్న నిర్మాత ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని భావించి పవన్‌కళ్యాణ్, మహేష్‌బాబు, ఎన్టీఆర్ వంటి వారికి ఈ సినిమాను చూపించాడు. అయితే పలు కారణాల వల్ల ఏ హీరో కూడా ఈ చిత్రం రీమేక్‌లో నటించడానికి ముందుకు రాలేదు. దీంతో ఈ చిత్రం ఇంతకాలం ప్రేక్షకుల ముందుకు రాకుండా ఆలస్యమైంది. చివరకు ఈ చిత్రాన్ని తెలుగులో డబ్బింగ్ చేసి విడుదల చేయడానికి ఠాగూర్ మధు సిద్ధమయ్యాడు. ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు, సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. మార్చి మొదటివారంలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.