Advertisementt

గోపీసుందర్‌కి మల్టీస్టారర్‌ అవకాశం!

Mon 16th Feb 2015 01:51 AM
gopi sundar,music director,malli malli idi rani roju,nagarjuna and karthi movie  గోపీసుందర్‌కి మల్టీస్టారర్‌ అవకాశం!
గోపీసుందర్‌కి మల్టీస్టారర్‌ అవకాశం!
Advertisement
Ads by CJ

తెలుగు సినీ ప్రేక్షకులకు భాషాభేదాలు ఉండవు. ఎవరికి టాలెంట్‌ ఉంటే వారిని ఆదరిస్తూ ఉంటారు. గతంలో పలు మలయాళ చిత్రాలకు సంగీతం అందించిన గోపీసుందర్‌ ఇటీవల విడుదలైన ‘మళ్లీమళ్లీ ఇది రాని రోజు’ ద్వారా టాలీవుడ్‌కు పరిచయమై మంచి సంగీతాన్ని అందించాడు. ఈ చిత్రానికి ఆయన అందించిన స్వరాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దీంతో గోపీసుందర్‌కు తెలుగులో కూడా ఇప్పుడు మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. తాజాగా పివిపి బ్యానర్‌లో నాగార్జున, కార్తీ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్‌ చిత్రానికి గోపీసుందర్‌కు సంగీతం అందించే అవకాశం లభించింది. ఇది చాలా పెద్ద అవకాశమే అని చెప్పాలి. ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందనున్న ఈ చిత్రం మ్యూజికల్‌గా హిట్‌ అయితే ఇక గోపీసుందర్‌కు మంచి భవిష్యత్తు ఉంటుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ