Advertisementt

సింగర్ సునీతలో సూపర్ క్లారిటీ..!

Sat 14th Feb 2015 01:02 PM
sunitha,singer,star heroines,dubbing artist  సింగర్ సునీతలో సూపర్ క్లారిటీ..!
సింగర్ సునీతలో సూపర్ క్లారిటీ..!
Advertisement
Ads by CJ

మంచి గాత్రంతో పాటు అందం, అభినయం కలగలిపిన సింగర్ సునీత. 'ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావు' అనే పాటతో అభిమానుల హృదయాలను కొల్లగొట్టింది. అప్పటి నుండి మంచి సింగర్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకుంది. టాప్ హీరోయిన్స్ లో చాలా మందికి డబ్బింగ్ చెప్పింది. 'గోదావరి' లో కమలిని ముఖర్జీకి తను ఇచ్చిన వాయిస్ ఆ సినిమాకే హైలైట్ అని చెప్పొచు. అయితే సునీత ను హీరో తల్లి, సోదరి పాత్రలలో నటించమని చాలా మంది సంప్రదించారట. దానికి ఆమె అంగీకరించలేదట. ఎందుకని ప్రశ్నించగా ''డబ్బింగ్ చెప్పడం కంటే నటించడమే సులువు. అయితే నేను నటిస్తున్నాని తెలిసి థియేటర్లకు వచ్చే ప్రేక్షకులను నేను మెప్పించలేకపోతే ఇంక వేరే సినిమాలలో నటించలేను. ప్రస్తుతం డబ్బింగ్ వర్క్స్ తో, స్టేజి షో లతో బిజీ గా ఉన్నాను. నటించాల్సిన సమయం వస్తే ఖచ్చితంగా నటిస్తాను కానీ, ప్రస్తుతం సింగర్ గానే కంటిన్యూ అవుతా" అని చెప్పారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ