Advertisement

ఎకరాకు కోటి కావాలంటున్న రైతులు..!!

Sat 14th Feb 2015 05:36 AM
gannavarma airport,land pooling,extension  ఎకరాకు కోటి కావాలంటున్న రైతులు..!!
ఎకరాకు కోటి కావాలంటున్న రైతులు..!!
Advertisement

ఎకరా భూమి ఇవ్వడానికి రైతులు అక్షరాల కోటి రూపాయలు డిమాండ్‌ చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు ఎకరా లక్షలు కూడా పలకని భూములు కోట్లకు పడగలెత్తుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరంలో విమానాశ్రయాన్ని విస్తరించనున్న సంగతి తెలిసిందే. దీనికోసం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో దాదాపు 450 ఎకరాల భూమి సేకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఆ జిల్లా కలెక్టర్‌ బుద్ధవరం, అజ్జంపూడి, కేసరవల్లి  గ్రామాల రైతులతో భేటీ అయ్యారు. అయితే భూములివ్వడానికి  రైతులు ఎకరాకు రూ. కోటి డిమాండ్‌ చేశారు. అప్పటికి ప్రభుత్వం కూడా అజ్జంపూడిలో ఎకరాకు రూ. 45 లక్షల, కేసురవల్లిలో ఎకరాకు రూ. 79 లక్షలు, బుద్ధవరంలో ఎకరాకు రూ. 50 లక్షలు ఇస్తామని చెప్పింది. అయితే రైతులు మాత్రం కోటి మీదనుంచి దిగలేదు. ఇక రైతులను మాట ప్రభుత్వానికి చెబుతానంటూ కలెక్టర్‌ అక్కడినుంచి తిరుగుప్రయాణమయ్యారు.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement