Advertisementt

మంత్రి నారాయణకు అంత తొందరెందుకు..??

Fri 13th Feb 2015 02:42 AM
municipal minister narayana,employees,guntur  మంత్రి నారాయణకు అంత తొందరెందుకు..??
మంత్రి నారాయణకు అంత తొందరెందుకు..??
Advertisement
Ads by CJ

ఆంధ్రప్రదేశ్‌ మున్సిపల్‌ శాఖ మంత్రి నారాయణ లేచిందే లేడికి పరుగుగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినబడుతున్నాయి. తన శాఖకు సంబంధించిన అధికారులంతా ఈనెల20లోగా గుంటూరు ప్రాంతానికి తరలివెళ్లాలని నారాయణ మౌఖికంగా ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే ఇంత తక్కువ వ్యవధిలో కుటుంబాలతో సహా తరలివెళ్లాలంటే తీవ్ర ఇబ్బందిగా ఉందని మరోవైపు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం గుంటూరు మార్కెట్‌యార్డు వద్ద తాత్కాలికంగా మున్సిపల్‌ కార్యాలయానికి ఏర్పాట్లు చేశారని, అక్కడినుంచి విధులు నిర్వహించడం కూడా కష్టమని వారు చెబుతున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం పిల్లలకు పరీక్షలు కూడా సమీపించాయని, ఈ తరుణంలో కుటుంబాలను అక్కడికి తీసుకెళ్లడం తీవ్ర ఇబ్బందని వారంటున్నారు. మరి ఉద్యోగుల ఇబ్బందులను దృష్టిలోపెట్టుకొని ఉద్యోగుల తరలింపును నారాయణ మరో రెండు నెలలు వాయిదా వేస్తారేమో వేచిచూడాలి..!

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ