'టెంపర్' పుట్టిస్తోన్న స్టిల్స్..!

Thu 12th Feb 2015 07:18 AM
Advertisement
temper,ntr,kajal,poster stills,double meaning dialogues  'టెంపర్' పుట్టిస్తోన్న స్టిల్స్..!
'టెంపర్' పుట్టిస్తోన్న స్టిల్స్..!
Advertisement

'టెంపర్' చిత్రం రిలీజ్ కు దగ్గరయ్యే కొద్ది ఈ యూనిట్ విడుదల చేస్తోన్న స్టిల్స్, ట్రైలర్స్ సినిమాపై మంచి హైప్ ను క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా కాజల్ ఎన్టీఆర్ కు ముద్దు పెట్టే స్టిల్ కిర్రెక్కించే విధంగా మాంచి రొమాంటిక్ గా ఉందనే ప్రశంసలు లభిస్తున్నాయి. ఈ చిత్రం స్టిల్స్, ట్రైలర్స్ చూసి సినిమాలో హింస, శృంగార సన్నివేశాలు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఎక్కువగా ఉన్నాయని భావించిన వారికీ తీపి వార్తలా ఈ చిత్రానికి కేవలం 'యు/ఎ' సర్టిఫికేట్ లభించడంతో ఈ సినిమా ఫ్యామిలీస్ కు కూడా నచ్చుతుందనే ఆశాభావం వ్యక్తమవుతోంది. ఈ చిత్రం రన్ టైం మొత్తంగా 141 నిమిషాలని, ఫస్ట్ హాఫ్ గంట 8 నిముషాలు, సెకండ్ హాఫ్ గంట 13 నిముషాలు అని తెలుస్తుంది. అంతేగాక ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ వాళ్ళు కూడా సినిమా బాగుందని అంటూ ప్రశంసించారని సమాచారం. మరి ఏ విషయం తెలియాలంటే 13వ తేదీ దాకా వెయిట్ చేయకతప్పదు.

Advertisement
Advertisement

Loading..
Loading..
Loading..
advertisement