Advertisementt

కండిషన్స్ అప్లై అంటున్న బన్నీ..!

Thu 12th Feb 2015 06:47 AM
allu arjun,desamuduru,lip lock scenes,six pack body  కండిషన్స్ అప్లై అంటున్న బన్నీ..!
కండిషన్స్ అప్లై అంటున్న బన్నీ..!
Advertisement
Ads by CJ

ఈమధ్య అల్లుఅర్జున్ తో సినిమా చేయాలంటే కండీషన్స్ బాగానే పెడుతున్నాడు. నిన్నటికి నిన్న ఇకపై లిప్ లాక్ సీన్స్ నటించనని  తేల్చిచెప్పాడు. తాజాగా తాను సిక్స్ ప్యాక్ బాడీ అంటూ చొక్కా లేకుండా సినిమాలలో కనిపించనని చెప్పేశాడు. టాలీవుడ్ లో తొలిసారిగా సిక్స్ ప్యాక్ సాధించి చొక్కా విప్పి బాడీని చూపించింది బన్నీనే. 'దేశముదురు, బద్రీనాద్' చిత్రాల్లో ఆయన ఈ విధంగా తన అభిమానులకు సంతోషం పంచాడు. కానీ లిప్ కిస్ లు , ఒంటిపై చొక్కా లేకుండా బాడీని చూపించడం వంటివి ఉంటే ఫ్యామిలీ ఆడియన్స్ ఇబ్బందిగా ఫీలవుతున్నారని తెలుసుకున్న బన్నీ తాజాగా ఈ నిర్ణయం తీసుకున్నాడు. సిక్స్ ప్యాక్ ను చూపించడం రొటీన్ అయిపోయిందని, ఎన్ని సార్లు అలా  చూస్తారు?  అంటూ చొక్కా విప్పనంటూ డిసైడ్ అయిపోయాడు. మొత్తానికి పోను పోను అల్లుఅర్జున్ తన ముందు చాలా కండీషన్స్ పెట్టే అవకాశం ఉందని అంటుంటే.. కొందరు మాత్రం స్టోరీ డిమాండ్ చేసిందంటూ మరలా అలాంటి  సీన్లు చేయకుండా ఎలా ఉంటాడు? అంటున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ