Advertisement

ఇళ్లపై తర్జనభర్జనలో టీ-సర్కారు..!!

Wed 11th Feb 2015 04:42 AM
two bedroom house,kcr,housing ministry,telangana  ఇళ్లపై తర్జనభర్జనలో టీ-సర్కారు..!!
ఇళ్లపై తర్జనభర్జనలో టీ-సర్కారు..!!
Advertisement

ఎన్నికలకు ముందు కేసీఆర్‌ ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రెండు పడక గదుల ఇళ్లపై ఇప్పుడు టీ-సర్కారు తర్జనభర్జన పడుతోంది. రెండు పడక గదుల ఇళ్లను నిర్మించాలంటే నాలుగు లక్షలకు పైగానే ఖర్చు వస్తుండటంతో ఈ పథకంపై ముందుకు ఎలా వెళ్లాలనే విషయమై టీ-సర్కారు తేల్చుకోలేకపోతోంది. అంతేకాకుండా ఈ ప్రాజెక్టు గురించి వెంకయ్యనాయుడికి వివరించి ఈ ఇళ్ల నిర్మాణంలో కేంద్రం కొంత భారాన్ని భరించేలా ఒప్పించింది. ఇక ఫిబ్రవరి 12లోపు ఈ ఇళ్లపై తుది నిర్ణయాన్ని తీసుకోవాలని, వీలైనంత వరకు తక్కువ ఖర్చులో ఇండ్లు నిర్మించేలా చూడాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటికే ఈ ఇళ్లపై ఓ తుది నివేదికను రూపొందించిన గృహ నిర్మాణశాఖ గురువారం జరిగే సమీక్ష సమావేశంలో కేసీఆర్‌కు మొత్తం విషయాన్ని వివరించనుంది. మరి ఈ పథకాన్ని పేదలందరికీ వర్తింపజేస్తారో లేక దళితులకు భూ పంపిణీ మాదిరిగా మండలానికి కొందరికి వర్తింజేసి పథకం అమలుచేసినట్లు ప్రకటిస్తారో వేచిచూడాల్సిందే..!

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement