Advertisementt

'బెంగుళూర్ డేస్' రీమేక్ లో శర్వానంద్..?

Mon 09th Feb 2015 09:01 AM
sharvanand,dil raju,pvp,banglore days,bommarillu bhaskar  'బెంగుళూర్ డేస్' రీమేక్ లో శర్వానంద్..?
'బెంగుళూర్ డేస్' రీమేక్ లో శర్వానంద్..?
Advertisement
Ads by CJ

మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన  సినిమా 'బెంగుళూర్ డేస్' చిత్రాన్ని తెలుగు రీమేక్ రైట్స్ దిల్ రాజు, పివిపి సంపాదించుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం కాస్టింగ్ విషయంలో చాలా మంది హీరోల పేర్లు వినిపించాయి. మొదట జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య నటిస్తున్నారని, తరువాత సిద్ధార్థ, సమంత జంటగా చేయనున్నారని వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు ఆ లిస్టు లో శర్వానంద్ పేరు వినిపిస్తుంది. 'రన్ రాజా రన్' సినిమాతో హిట్ కొట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన 'మళ్లీ మళ్లీ ఇది రాణి రోజు' చిత్రంతో పాజిటివ్ టాక్ సంపాదించుకున్నాడు. ఇప్పుడు 'బెంగుళూర్ డేస్' చిత్రం రీమేక్ లో ఓ లీడ్ రోల్ లో నటించడానికి సైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడట. బొమ్మరిల్లు బాస్కర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ