Advertisementt

నిన్నటివరకు 'శ్రీమంతడు'.. ఇప్పుడు 'జమిందార్'..!

Fri 06th Feb 2015 09:45 PM
mahesh babu,koratala siva,sruthihasan,zamindar title  నిన్నటివరకు 'శ్రీమంతడు'.. ఇప్పుడు 'జమిందార్'..!
నిన్నటివరకు 'శ్రీమంతడు'.. ఇప్పుడు 'జమిందార్'..!
Advertisement
Ads by CJ

కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు ఓ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మహేష్ సరసన శ్రుతిహాసన్ నటించగా, దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం గురించి ఏదోక వార్త వస్తూనే ఉంది. నిన్నటివరకు సినిమా టైటిల్ 'శ్రీమంతుడు' అని అన్నిపేపర్లలో, వెబ్ లలో వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు మరొక టైటిల్ అనుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. 'మగాడు' , 'జమిందార్' అనే రెండు టైటిల్స్ ను పరిగణలోకి తీసుకున్నట్లు సమాచారం. 'మగాడు' అనే టైటిల్ మహేష్ ముందు నటించిన చిత్రాలకు దగ్గరగా ఉండటంతో 'జమిందార్' ను కన్ఫర్మ్ చేయనున్నారని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. కాగా కొన్నిచోట్ల 'శ్రీమంతుడు' అనే టైటిల్ తో మహేష్ బాబు ఫ్యాన్స్ పోస్టర్లు కూడా చేయించారు. అయితే టైటిల్ 'శ్రీమంతుడు' కాదని తెలిసిన అభిమానులు నిరాశ కు లోనైనా ఇప్పటికైనా అఫీషియల్ గా టైటిల్ అనౌన్సు చేయాలని కోరుకుంటున్నారు.

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ