Advertisementt

10మందితో డేటింగ్ చేయమంటున్న అలియాభట్..!

Fri 06th Feb 2015 05:33 AM
  10మందితో డేటింగ్ చేయమంటున్న అలియాభట్..!
10మందితో డేటింగ్ చేయమంటున్న అలియాభట్..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ మహేష్ భట్ కూతురు అలియాభాట్ కరణ్ జోహార్ తెరకెక్కించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' చిత్రం ద్వారా తెరంగేట్రం చేసింది. తొలిచిత్రంలోనే మంచి మార్కులు కొట్టేసిన ఈ అమ్మడు తర్వాత 'హైవే, టు స్టేట్స్' వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందంపరంగా, పెర్ఫార్మెన్స్ పరంగా హాట్ అండ్ సెక్సీ సీన్లలో ఎలాంటి జంకు లేకుండా నటించే విషయాల్లో అమ్మడు బాగా ఆరి తేరింది. దీంతో త్వరలోనే అలియాభట్ బాలీవుడ్ లో మంచి పొజిషన్ కు చేరుకుంటుందని సినీ విమర్శకులు, సినీ విశ్లేషకుల నుండి కూడా ఆమెకు ప్రశంసలు అందాయి. కేవలం ఇలాంటి విషయాల్లో మాత్రమే కాదు.. బోల్డ్ స్టేట్ మెంట్స్ ఇచ్చే విషయంలోనూ అలియా ఓ అడుగు ముందే ఉంది. ప్రేమ, పెళ్లి విషయాల గురించి అలియా సెన్సేషన్ కామెంట్స్ చేసింది. ఒక మహిళ తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. కనీసం 10 మంది మగాళ్లతో డేటింగ్ చేయాలి. అప్పుడే ఎవరు బెస్ట్ అనే విషయం కూడా తెలుసుకోవడానికి వీలుగా ఉంటుంది. చివరగా ఆ పదిమందిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి.. అంటూ చెప్పుకొచ్చింది. 21 ఏళ్ళ వయసులోనే ఇన్ని సొంత అభిప్రాయాలు ఉన్న అలియాభట్ తన నిజ జీవితంలో వివాహం విషయంలో ఎంత మందితో డేటింగ్ చేస్తుందో చుదాలన్తున్నారు బాలీవుడ్ జనాలు.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ