Advertisement

‘‘చాకలి ఐలమ్మ’’గా విజయశాంతి..!

Thu 05th Feb 2015 07:24 AM
chiranjeevi,vijayashanthi,osey ramulamma,chakali ilemma  ‘‘చాకలి ఐలమ్మ’’గా విజయశాంతి..!
‘‘చాకలి ఐలమ్మ’’గా విజయశాంతి..!
Advertisement

చిరంజీవి 150వ సినిమాతో థర్డ్‌ ఇన్నింగ్స్‌ 

రాంఘవేంద్రరావు ` నాగార్జున కాంబినేషన్‌

రాజశేఖర్‌ ‘గడ్డం గ్యాంగ్‌’

నిన్నటితరంవారంతా రీ`ఎంట్రీ గ్రాండ్‌గా ఇస్తున్నారు. చిరంజీవితో 19 బాలకృష్ణతో 16 వెరసి మొత్తం 186 చిత్రాలు చేసిన ‘ఒసేయ్‌ రాములమ్మ’ విజయశాంతి తక్షణ ‘కర్తవ్యం’ ` వెండితెరపై తన ఉనికిని చాటుకోవడమే.

ఒకనాడు భారతీయ జనతాపార్టీలో అద్వానీ, వెంకయ్యనాయుడువంటి అగ్ర నాయకులతో సన్నిహిత సంబంధాలున్న విజయశాంతి తల్లి తెలంగాణ ` టిఆర్‌ఎస్‌ ` కాంగ్రెసు పార్టీల మార్పుతో దాదాపుగా రాజకీయ జీవితం తెరమరుగయినట్లే. ఈ దశలో ఆమెకో గుర్తింపు రావాలంటే సినిమారంగం ఒక్కటే శరణ్యం. ‘రాణీ రుద్రమదేవి’గా ఒకప్పుడు విజయశాంతి పేరు వినిపించింది. ఇప్పుడు ఆ ద్వారాలూ మూతపడ్డాయి. ఉద్యమనేపధ్యం ఇతివృత్తంగా ఆమె రీ`ఎంట్రీ ఇస్తే బాగుంటుంది. ‘‘చాకలి ఐలమ్మ’’ వంటి వారి జీవిత కథల్ని అధ్యయనం చేయడం మంచిది. తరాలు మారుతున్నాయి. ఆలస్యం చేస్తే రేపటితరానికి విజయశాంతి తెలియకపోవచ్చు. రజనీకాంత్‌, కృష్ణ, శోభన్‌బాబు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, రాజశేఖర్‌ వంటి కథానాయకులకు ధీటుగా ఓపెనింగ్స్‌ తెచ్చుకున్న విజయశాంతి అవసరం పరిశ్రమకి వుంది. ఒకప్పుడు ‘చిరంజీవి ` విజయశాంతి’ కాంబినేషన్‌ సూపర్‌హిట్‌ కాంబినేషన్‌! ‘గ్యాంగ్‌ లీడర్‌’ తర్వాత వీరి కాంబినేషన్‌ లేదు. తాజాగా చిరంజీవి 150వ సినిమా విడుదలనాటికి విజయశాంతి కూడా తెలంగాణ వీర వనిత ‘చాకలి ఐలమ్మ’గా కనిపిస్తుందని ఆశిద్దాం!

-తోటకూర రఘు

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement