Advertisementt

చిరు కి స్పెషల్ షో అంటున్న హీరో..!

Wed 04th Feb 2015 07:39 AM
chiranjeevi,special show,gaddam gang,rajasekhar  చిరు కి స్పెషల్ షో అంటున్న హీరో..!
చిరు కి స్పెషల్ షో అంటున్న హీరో..!
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవికి, హీరో రాజశేఖర్ కు మధ్యమ వచ్చిన కలతలు తొలగిపోతున్న సంగతి తెలిసిందే. రకరకాల కారణాలు, పరిస్థితుల వల్ల గతంలో మనస్పర్ధలు చోటు చేసుకున్నాయి. అయితే నాగబాబు చొరవతో అవి మరిచి మళ్ళీ ఇద్దరు దగ్గరవుతున్నారు. ఈ విషయాన్ని రాజశేఖర్ సొంతంగా తెలియజేసిన సంగతి తెలిసిందే. త్వరలో తాను మెగాస్టార్ చిరంజీవిని తన ఇంట్లో జరిగే ఓ ఫంక్షన్ కు స్వయంగా ఇన్వైట్  చేస్తానని చెప్పిన రాజశేఖర్ ఆ పని చేస్తున్నాడు. తన సొంత చిత్రమైన 'గడ్డం గ్యాంగ్' చిత్రాన్ని చిరు కోసం స్పెషల్ షో వేయిస్తానన్నాడు. ఈ చిత్రం ఈ నెల 6 వ తేదీన విడుదల కానుంది. మరి రాజశేఖర్ ఆహ్వానానికి చిరు ఎలా స్పందిస్తాడో వేచి చూడాల్సివుంది.

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ