Advertisement

‘మాంగల్యానికి మరో ముడి, ఓ సీతకధ’ దర్శకుడు ఏమయ్యాడు?

Mon 02nd Feb 2015 07:55 AM
viswanath,balachandar,o seetha kadha,mangalyaniki maromudi,  ‘మాంగల్యానికి మరో ముడి, ఓ సీతకధ’ దర్శకుడు ఏమయ్యాడు?
‘మాంగల్యానికి మరో ముడి, ఓ సీతకధ’ దర్శకుడు ఏమయ్యాడు?
Advertisement

తమిళంలో బాలచందర్‌ ` సామాజిక స్పృహ వున్న కథల్ని ఎంచుకుని, స్టార్‌డమ్‌ని తట్టుకుని తమిళ సినిమాపై బలమైన చేవ్రాలు వేశారు. ‘స్వర్గం ` నరకం, తూర్పు పడమర, కన్యాకుమారి, నీడ’ తదితర చిత్రాలు తీసినా దాసరి స్వయంగా తాను బాలచందర్‌కి ఏకలవ్య శిష్యుడినని చెప్పుకోవడంతో ఆ కోవలో సినిమాలు తీయగల దర్శకునిగా విశ్వనాధ్‌కి గుర్తింపు వచ్చింది. ‘మాంగల్యానికి మరోముడి, ఓ సీతకధ’ వంటి సామాజిక స్పృహ వున్న చిత్రాలు తీసి సెహబాష్‌ అనిపించుకున్నారు. ‘జీవనజ్యోతి, జీవితనౌక’ తదితర చిత్రాలను శోభన్‌బాబుతో తీసిన విశ్వనాధ్‌ ఎన్టీఆర్‌ ` అక్కినేనితోనూ సినిమాలు తీశారు. ‘‘శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం’’ తదితర చిత్రాల తర్వాత విశ్వనాధ్‌ సినిమా అంటే సంగీతం, నాట్య ప్రధాన చిత్రాలుగా ముద్రపడ్డాయి. విశ్వనాధ్‌ ` కమల్‌ ` జయప్రద ` రాధిక ఆ కాంబినేషన్‌ వేరు. మళ్ళీ ఆ రోజులు రావుకూడా!

జీవిత చరమాంకంలోకి వచ్చిన విశ్వనాధ్‌ సీనియర్‌ సిటిజన్స్‌ జీవితాలను ఇతివృత్తంగా తీసుకొని సినిమా తీయాలి. తెలుగు సినిమాకి ‘‘ఉత్తమ సినిమా’’గా జాతీయ అవార్డుని అందించాలి!!

తెలుగు ప్రేక్షకుడు ఆయననుంచి ఆశించేది ఇదే!

 

 -తోటకూర రఘు

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement